వివాదాస్పద వ్యాఖ్యలు..శశిథరూర్ కు అరెస్ట్ వారెంట్

Tue,August 13, 2019 04:11 PM

Kolkata Court issues arrest warrant against Shashi Tharoor


కోల్ కతా: బీజేపీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కు కోల్ కతా మెట్రోపాలిటన్ మేజిస్ట్ర్రేట్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీచేసింది. గతేడాది జులైలో తిరువనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో శశిథరూర్ మాట్లాడుతూ..బీజేపీ 2019 ఎన్నికల్లో గెలిచి తిరిగి అధికారంలోకి వస్తే భారత్ ను హిందూ పాకిస్థాన్ గా మారుస్తుందంటూ థరూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ సుమిత్ చౌదరీ అనే లాయర్ శశిథరూర్ పై కోల్ కతా కోర్టులో కేసు వేశారు. దీనిపై విచారణ జరిపిన మెట్రోపాలిటన్ మేజిస్ట్ర్రేట్ కోర్టు శశిథరూర్ కు అరెస్ట్ వారెంట్ జారీచేసింది.

3706
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles