'ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌' స్వీకరించిన కేంద్ర మంత్రులు..వీడియోలు వైర‌ల్‌

Thu,May 24, 2018 06:27 PM

Kiren Rijiju, Piyush Goyal, Dr Harsh Vardhan take up Rajyavardhan Rathores FitnessChallenge

న్యూఢిల్లీ: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్‌లో కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ మంత్రి రాజ్యవర్థన్‌సింగ్ రాథోడ్ ప్రారంభించిన ఫిట్‌నెస్ ఛాలెంజ్‌కు దేశవ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఫిట్‌నెస్‌పై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో రాథోడ్ హమ్ ఫిట్ హైతో ఇండియా ఫిట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే సినీ నటీనటులు హృతిక్ రోషన్, అక్కినేని నాగచైతన్య, అఖిల్, అనుష్క శర్మ, క్రీడాకారులు విరాట్ కోహ్లీ, సైనా నెహ్వాల్ ఈ సవాల్ స్వీకరించారు. దేశ ప్రధాని నరేంద్రమోదీ సైతం ఛాలెంజన్ స్వీకరిస్తున్నానని ట్విటర్ ద్వారా వెల్లడించడం విశేషం.

తాజాగా కేంద్రమంత్రులు కూడా దీన్ని ఛాలెంజ్‌గా తీసుకొన తమదైన శైలిలో కసరత్తులు చేసి ఆ వీడియోలను ట్విటర్‌లో ఫాలోవర్స్‌తో పంచుకున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు, రైల్వే మంత్రి పియూశ్ గోయల్, శాస్త్ర, సాంకేతిక, వాతావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్, పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా, మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి యశోధర రాజే సింధియా, పలువురు చట్టసభ సభ్యులు సవాల్‌ను స్వీకరించారు. ప్రస్తుతం ఈ ఛాలెంజ్‌పై సోషల్‌మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది.
2691
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS