ఆ గ్యాంగ్ 33 మంది డ్రైవ‌ర్ల‌ను హ‌త‌మార్చింది..

Wed,September 12, 2018 04:50 PM

Kingpin of truck driver killing gang arrested in Madhya Pradesh


భోపాల్: మధ్యప్రదేశ్‌లో సీరియల్ కిల్లర్ దొరికాడు. 33 మంది ట్రక్కు డ్రైవర్లను చంపిన 48 ఏళ్ల వ్యక్తిని భోపాల్ పోలీసులు అరెస్టు చేశారు. గత దశాబ్ధ కాలంలో అతను త‌న గ్యాంగ్‌తో ఈ హత్యల‌కు పాల్ప‌డ్డాడు. సరకులతో వెళ్తున్న వాహన డ్రైవర్లను టార్గెట్ చేసి, ఆ త‌ర్వాత డ్రైవ‌ర్‌ను హత్య చేసేవారు. రోడ్డుపై ఉండే దాబాల వద్ద డ్రైవర్లతో దోస్తీ చేసి, వారికి ఆహారంలో మత్తుమందు ఇచ్చేవాళ్లు. ఆ తర్వాత ట్రక్కును ఓ గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకువెళ్లి, అక్కడ కొందరి సాయంతో డ్రైవర్ల శవాలను అడవుల్లో పారేసేవాడని పోలీసులు తేల్చారు. డ్రైవర్లను చంపిన తర్వాత ఆ ట్రక్కులో ఉన్న సామాన్లను అమ్ముకునేవారు. వాస్తవానికి అనుమానిత హంతకుడు కొన్నేళ్ల క్రితం దొంగతనం కేసులో మహారాష్ట్రలో అరెస్టు అయ్యాడు. ఆ తర్వాత టేలర్‌గా పనిచేసిన అతను మళ్లీ దారి దోపిడీలకు ప్రయత్నించాడు. ట్ర‌క్కు డ్రైవ‌ర్ల‌ను హ‌త్య చేసిన గ్యాంగ్‌కు సంబంధించిన 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ అంత‌ర్ రాష్ట్ర ముఠా 2010 నుంచి ఈ హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్న‌ది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర‌, చ‌త్తీస్‌ఘ‌డ్‌, ఒడిశాలో ఈ హ‌త్య‌లు జ‌రిగాయి.

2955
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles