కిడ్నీ రాకెట్‌.. హాస్ప‌ట‌ల్ ఎండీ అరెస్టు

Mon,May 27, 2019 02:53 PM

Kidney racket in Visakhapatnam, Sraddha Hospital MD arrested

హైద‌రాబాద్‌: విశాఖ‌ప‌ట్ట‌ణంలో కిడ్నీ రాకెట్‌కు పాల్ప‌డిన శ్ర‌ద్దా హాస్ప‌ట‌ల్ మేనేజింగ్ డైర‌క్ట‌ర్ డాక్ట‌ర్ ప్ర‌దీప్ కుమార్‌ను పోలీసులు ఇవాళ ఉద‌యం అరెస్టు చేశారు. శ్ర‌ద్ధా హాస్ప‌ట‌ల్ అక్ర‌మ ప‌ద్ధ‌తుల్లో కిడ్నీ ఆప‌రేష‌న్లు నిర్వ‌హించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీంతో ఆ ఆసుప‌త్రిపై పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. జిల్లా క‌లెక్ట‌ర్ కే భాస్క‌ర్ ఆదేశాల ప్ర‌కారం.. హాస్ప‌ట‌ల్‌ను శ‌నివారం మూసివేశారు. ముగ్గురు స‌భ్యుల క‌మిటీ ఇచ్చిన ఆదేశాల‌ను పోలీసులు పాటించారు. శ్ర‌ద్ధా హాస్ప‌ట‌ల్ 68 కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేష‌న్ స‌ర్జరీలు చేసింద‌ని, అందులో 29 స‌ర్జ‌రీల‌కు ఎటువంటి అనుమ‌తి లేద‌ని క‌మిటీ పేర్కొన్న‌ది. కిడ్నీ రాకెట్‌లో మ‌ధ్య‌వ‌ర్తిగా ఉన్న‌ డాక్ట‌ర్ మంజూనాథ్‌ను బెంగుళూరులో అరెస్టు చేశారు.

1223
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles