వాట్సప్ లో వైర‌ల‌వుతున్న చిన్నారి వీడియో చూశారా?

Mon,August 21, 2017 05:39 PM

Kid Reading One two three Video goes viral on social media

గ‌త రెండు మూడు రోజుల నుంచి వాట్సప్ లో వైర‌ల‌వుతున్న వీడియో ఇది. ఓ చిన్నారి.. వ‌య‌సు 5 లోపే ఉండొచ్చు. వ‌న్.. టూ.. త్రీ.. ఫోర్.. ఫైవ్... అంటూ నేర్చుకోవ‌డం.. మ‌ధ్య‌లో టూ బ‌దులు త్రీ అన‌డం.. దీంతో కోపంతో చిన్నారి అమ్మ మంద‌లించ‌డం.. ఏడ్చుకుంటూ.. బాధ ప‌డుతూ... త‌ప్ప‌క‌... మళ్లీ... త్రీ న‌యి యే ఫోర్ అన‌డం.. మ‌ళ్లీ.. ఫైవ్ అన‌డం నెటిజన్ల‌కు కంట‌త‌డి పెట్టించింది. అయ్యే.. ఇంత చిన్న వ‌య‌సులోనే ఈ చిన్నారికి ఏందీ చ‌దువు తిప్ప‌లు అని అనుకున్నాం. ఇంత చిన్న వ‌య‌సులోనే ఆ చిన్నారికి ఇంత బాధ అవ‌స‌ర‌మా.. ఇప్పుడు చ‌దివి ఆ చిన్నారి ఉద్ద‌రించాల్సిందేమైనా ఉందా? అనే కామెంట్లు నెటిజ‌న్ల నుంచి వ‌చ్చాయి.

ఇక్క‌డ మ‌నం తెలుసుకోవాల్సిన విష‌యం ఇంకోటి ఉంది. అస‌లు.. ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవ‌డానికి కార‌ణం క్రికెట‌ర్లు విరాట్ కోహ్లీ, శిఖ‌ర్ ధావ‌న్, యూవ‌రాజ్ సింగ్. అవును.. వీళ్లు ముగ్గురే. ముందుగా ఆ వీడియో ను విరాట్ కోహ్లీ త‌న ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశారు. ఆ త‌ర్వాత‌.. శిఖ‌ర్ ధావ‌న్, యువ‌రాజ్ సింగ్ కూడా త‌మ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ల‌లో షేర్ చేయ‌డంతో ఇక ఆ వీడియో సోష‌ల్ మీడియాలో గ‌త రెండు మూడు రోజుల నుంచి తెగ హ‌ల్ చ‌ల్ చేయ‌డ‌మే కాదు.. ప్ర‌తి ఇంట్లోని చిన్న పిల్ల‌లు ఆ వీడియో చూసి వామ్మో.. చ‌దువు కోసం ఇంత క‌ష్ట‌ప‌డాలా అని భ‌య‌ప‌డుతున్నారు.

ఏది ఏమైనా.. పిల్ల‌లు ఎలాగైనా చ‌ద‌వాలి.. ర్యాంకులు తెచ్చుకోవాలి.. అని వాళ్ల ఫీలింగ్స్, బాధ ను ప‌ట్టించుకోకుండా.. చ‌ద‌వాలంటూ వాళ్ల మీద ఒత్తిడి తేవ‌డం క‌రెక్ట్ కాదు. భ‌య‌పెడుతూ చదివిస్తే ఎవ‌రూ చ‌ద‌వ‌రు. ఇది నిజంగా చాలా బాధాక‌ర‌మైన విష‌యం. త‌ల్లిదండ్రులు పిల్ల‌ల‌ను ప్రేమ‌, ఆప్యాయ‌త‌తో ద‌గ్గ‌రికి తీసుకోవాలి కాని... భ‌యంతో వాళ్ల‌ను బెదిరిస్తే ఒరిగేదేమీ ఉండ‌దు.. అంటూ చెప్పుకొచ్చారు కోహ్లీ, శిఖ‌ర్ ధావ‌న్, యువ‌రాజ్.

A post shared by Virat Kohli (@virat.kohli) on

4142
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles