మీ బంగారం మీరు తీసుకొండి.. పశ్చాతాప పడ్డ దొంగ!

Sun,July 15, 2018 03:11 PM

Kerala thief returns stolen gold ornaments with an apology note

వామ్మో ఈ మధ్య దొంగలు కూడా పశ్చాతాప పడుతున్నారు. వాళ్లకు కూడా మానవత్వం ఉందని నిరూపిస్తున్నారు. అందరు దొంగలు ఒకలా ఉండరని నిరూపించాడు ఈ మంచి దొంగ. అందరి దొంగల్లో ఈ దొంగ వేరయ్య అన్నట్లు ఉంది ఈ ఘటన.

అసలేంజరిగిందంటే..కేరళలోని అంబలపుజ సమీపంలోని థకుజి అనే గ్రామంలోని ఓ ఇంట్లో ఒక దొంగ బంగారం దొంగతనం చేశాడు. ఫ్యామిలీ అంతా బంధువుల పెండ్లికి వెళ్లడంతో మనోడు తిన్నగా ఇంట్లోకి దూరి లాకర్ ఓపెన్ చేసి ఓ ఫింగర్ రింగ్, ఇయర్ రింగ్, లాకెట్ దొంగలించాడు.

ఇక.. పెండ్ల నుంచి తిరిగొచ్చిన ఆ కుటుంబం ఇంట్లో దొంగతనం జరిగిందని తెలుసుకొని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తుండగా.. ఓ వింత ఘటన చోటు చేసుకున్నది. ఆ దొంగ.. దొంగతనం చేసిన ఇంటికి మళ్లీ వెళ్లి దొంగలించిన ఆ నగలన్నింటినీ ఇంటి యజమానులకు అందించాడు. ఓ క్షమాపణ లెటర్‌ను కూడా రాసి వాళ్లకు అందించాడు. దీంతో యజమానులు షాకయ్యారు. వీడే దొంగతనం చేసి మళ్లీ వీడే తెచ్చిచ్చాడేంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

"నన్ను క్షమించండి. నేను తప్పు చేశా. ఇది కరెక్ట్ కాదనిపించింది. అందుకే.. మళ్లీ మీనగలు మీకు ఇచ్చేస్తున్నా. నన్ను అరెస్ట్ చేయించకండి ప్లీజ్. ఏదో తెలియని తనంతో ఈ దొంగతనం చేశా.." అంటూ ఆ లెటర్‌లో ఆ మంచి దొంగ పేర్కొన్నాడట.

ఇక.. మనోడి మంచి బుద్ధికి కరిగిపోయిన ఆ ఇంటి యజమానులు పోలీసు కేసు వాపసు తీసుకొని వదిలేశారట. భలే దొంగవు రా బాబు నువ్వు. మళ్లీ ఇంకోసారి అటువంటి పని చేయకుండా బుద్ధిగా ఏదైనా పని చేసుకొని బతుకుపో.

5804
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles