ఇంటి నుంచి పారిపోయి..లయన్ ఎన్‌క్లోజర్‌లో..వీడియో

Wed,February 21, 2018 06:20 PM

Kerala man jumps into lion enclosure later rescued


కేరళ: ఇటీవల కేరళలో ఓ వ్యక్తి బాహుబలి సినిమాలోని ఏనుగు ఫీట్ చేద్దామనుకుని కంగుతిన్న సంగతి తెలిసిందే. తాజాగా కేరళలో మురుగన్ అనే వ్యక్తి ఏకంగా సింహాలతోనే చిట్‌చాట్ చేయాలనుకున్నాడు. అనుకున్న వెంటనే మురుగన్ ఉదయం 11:45 గంటల సమయంలో సెక్యూరిటీ గార్డుకు తెలియకుండా సందర్శకులను తోసుకుంటూ తిరువనంతపురం జూలోకి ప్రవేశించాడు. మురుగన్ జూలో నడుచుకుంటూ కాకుండా అంబాడుకుంటూ వెళ్లాడు. మురుగన్ చేష్టలతో ఆశ్చర్యానికి లోనైన జూ సందర్శకులు ఈ విషయాన్ని అధికారులకు తెలియజేశారు. జూ అధికారులు అక్కడికి చేరుకుని మురుగన్ ను బయటకు తీసుకొచ్చారు.

మురుగన్ ను కేరళలోని పాలక్కాడ్ వాసిగా గుర్తించారు. వారం రోజుల క్రితం మురుగన్ తన ఇంటి నుంచి పారిపోయి వచ్చాడు. ఆ తర్వాత అతని కుటుంబసభ్యులు మురుగన్ కోసం మీడియాలో ప్రకటనలు కూడా ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. లయన్ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లే క్రమంలో మురుగన్‌కు స్వల్పగాయాలయ్యాయని..అతనిని ఆస్పత్రిలో చేర్పించామని జూ అధికారి ఒకరు వెల్లడించారు.3796
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles