ఈ పెండ్లి కూతురు పేరు కరెక్ట్‌గా పలికితే మీరు గ్రేట్!

Mon,May 14, 2018 03:12 PM

Kerala Man Flooded With Calls About Wife Name After Wedding Card Goes Viral

ఈ చాలెంజ్ మేం విసిరేది కాదు. పెండ్లి కొడుకు చాలెంజ్ ఇది. కాని.. అతడు చేసిన చాలెంజే అతడి కొంపముంచింది. అనవసర చిక్కుల్లో పడేలా చేసింది. మరి.. మీరేమైనా ట్రై చేస్తారా? పదండి... కాస్త వివరంగా తెలుసుకుందాం.

విభీష్ టీటీ. కేరళలోని కొజికోడ్ వాసి. విభీష్‌కు పెండ్లి కుదిరింది. దీంతో చాలా ఖుషి అయ్యాడు. ఇక.. తన పెండ్లికి రావాలని తన ఫ్రెండ్స్‌కు, బంధువులకు పెండ్లి కార్డును వాట్సప్‌లో షేర్ చేశాడు. అయితే.. తన పెండ్లికి వచ్చేవాళ్లకు ఓ కండీషన్ పెట్టాడు. తను పెండ్లి చేసుకోబోయే అమ్మాయి పేరును ఎవరైతే కరెక్ట్‌గా పలుకుతారో వాళ్లకే ఈ ఆహ్వానం అన్నాడు.

ఇక.. ఆ పెండ్లి కార్డును చూసిన వాళ్లంతా కార్డు మీద ఉన్న నెంబర్లకు ఫోన్ చేసి ఆ పేరు అర్థాన్ని విభీష్‌ను అడగసాగారు. ఒకరు.. ఇద్దరు ఫోన్ చేస్తే విభీష్ కూడా లైట్ తీసుకునేవాడేమో కాని.. రోజుకు వందల కాల్స్ విభీష్‌కు, ఆయన తండ్రికి వస్తుండటంతో ఏం చేయాలో తెలియక జుట్టు పట్టుకొని కూర్చున్నాడు. మరికొంతమంది ఇంకాస్త ముందుకెళ్లి అతడికి ఫోన్ చేసి తిట్టడం ప్రారంభించారట. దీంతో ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని డిసైడ్ అయ్యాడు విభీష్. చూశారుగా.. ఏదో చేద్దామనుకుంటే మరేదో అయ్యింది మనోడికి.

అవన్నీ సరే గాని.. ఇంతకీ ఆ పెండ్లి కూతురు పేరేంది అంటారా? సరే.. ఇదిగో ఆమె పేరు ఇదే.. Dhyanoorhanagithy చదివారా? ఆ పేరును తెలుగులో రాయలేక అలాగే ఇంగ్లీష్‌లోనే రాసేశాం. ఆ పెండ్లి కూతురు తండ్రికి సాహిత్యంపై ఎక్కువ మక్కువట. అందుకే.. కొత్తగా, వినూత్నంగా ఉండాలని తన కూతురుకు ఆ పేరు పెట్టాడట. మరి.. మీరేమైనా ట్రై చేస్తారేమో చూడండి.

10283
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles