పెళ్లి వ‌ద్ద‌న్న యువ‌తిపై పెట్రోల్‌.. మంట‌ల్లో ఇద్ద‌రు మృతి

Thu,October 10, 2019 11:06 AM

హైద‌రాబాద్‌: కేర‌ళ‌లో మ‌రో దారుణం జ‌రిగింది. పెళ్లి ప్ర‌తిపాద‌న‌ను నిరాక‌రించిన‌ 17 ఏళ్ల యువ‌తిని ఆమె ప్రేమికుడు చంపేశాడు. యువ‌తిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఆ మంట‌ల్లో మిథున్ అనే యువ‌కుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘ‌ట‌న కేర‌ళ‌లోని ఎర్నాకుళం జిల్లాలో ఉన్న క‌క్క‌నాడ్‌లో జ‌రిగింది. ఇంట‌ర్ చ‌దువుతున్న దేవిక‌ను పెళ్లి చేసుకుంటాన‌ని మిథున్ వెంట‌ప‌డ్డాడు. కానీ ఆ పెళ్లికి అమ్మాయి పేరెంట్స్ అంగీక‌రించ‌లేదు. దేవిక ట్యూష‌న్ సెంట‌ర్‌కు వెళ్లిన మిథున్ అక్క‌డ ఆమెతో గొడ‌వ‌ప‌డ్డాడు. అదే రాత్రి ఆమె ఇంటికి వెళ్లి హంగామా చేశాడు. అయితే పెళ్లికి దేవిక అంగీక‌రించ‌క‌పోవ‌డంతో ఆమెపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు. ఆ మంట‌లు వ్యాపించ‌డం వ‌ల్ల‌ మిథున్ కూడా అగ్నికి బ‌ల‌య్యాడు. ఈ ఘ‌ట‌న‌లో అమ్మాయి తండ్రి గాయ‌ప‌డ్డాడు. వాస్త‌వానికి మిథున్ ప్ర‌వ‌ర్త‌న గురించి అమ్మాయి త‌ల్లితండ్రులు గ‌తంలోనే పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కానీ ఆ యువ‌కుడిపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌లేదు. అత‌ని పేరెంట్స్‌కు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా కానీ మిథున్ మాత్రం త‌న వైఖ‌రిలో మార్పు చూప‌లేదు. దేవిక‌ను రెగ్యుల‌ర్‌గా ట్యూష‌న్ సెంట‌ర్ వ‌ద్ద వేధిస్తూనే వ‌చ్చాడు. చివ‌ర‌కు ఆమె పెళ్లికి నిరాక‌రించ‌డంతో.. భ‌గ్న హృద‌యంతో మిథున్ ఈ ఘాతుకానికి పాల్ప‌డ్డాడు. ఇటీవ‌ల కేర‌ళ‌లో భ‌గ్న ప్రేమికుల హ‌త్యా ఘ‌ట‌న‌లు ఎక్కువ‌య్యాయి. ఈ ఏడాదిలోనే సుమారు ఆరేడు ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి.

6272
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles