ఆ విద్యార్థికి సోకింది నిఫానే..

Tue,June 4, 2019 10:07 AM

Kerala Health Minister KK Shailaja confirms a positive case of Nipah virus

హైద‌రాబాద్: కేర‌ళ‌లో ఓ విద్యార్థికి నిఫా వైర‌స్ సోకిన‌ట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైల‌జా తెలిపారు. కొచ్చికి చెందిన ఆ విద్యార్థి ర‌క్త న‌మోనాను .. పుణెకు చెందిన నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాల‌జీకి పంపారు. ఆ ఇన్‌స్టిట్యూట్ ఇవాళ రిపోర్ట్‌ను వెల్ల‌డించింది. కొచ్చి విద్యార్థికి నిఫా సోకిన‌ట్లు వైరాల‌జీ శాస్త్ర‌వేత్త‌లు వెల్ల‌డించారు. ర‌క్త‌ప‌రీక్ష‌లో పాజిటివ్‌గా తేలిన‌ట్లు ద్రువీక‌రించారు. నిపా వైరస్ బయటపడటంతో రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. తిరువనంతపురంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజ సోమ‌వారం కూడా మీడియాతో మాట్లాడుతూ సదరు విద్యార్థిని కొచిలోని ఒక ప్రైవేట్ దవాఖానలో చేర్చామని, ఆరోగ్యం మెరుగు పడిందని వైద్యులు తెలిపారన్నారు. నిపా వైరస్ గురించి ప్రజలు ఆందోళనకు గురి కావద్దని ఆమె కోరారు. కాగా ఎర్నాకుళం జిల్లాలో పరిస్థితిపై రాష్ట్ర ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సారథ్యంలో వైద్యాధికారులు సమీక్ష జరిపారు. నిఫా సోకిన కేర‌ళ విద్యార్థితో సుమారు 86 మంది విద్యార్థులు అతి స‌న్నిహితంగా మెలిగిన‌ట్లు స‌మాచారం ఉంది. అయితే ఆ విద్యార్థులంద‌రినీ అబ్జ‌ర్వేష‌న్‌లో పెట్టిన‌ట్లు మంత్రి తెలిపారు. ప్ర‌జ‌లెవ‌రూ భ‌య‌ప‌డ‌కూడ‌ద‌ని, త‌గిన జాగ్ర‌త్తలు తీసుకోవాల‌ని ఆమె సూచించారు.

1727
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles