వరద నష్టం పూడ్చడానికి మందు రేట్లు పెంచారు!

Fri,August 17, 2018 05:11 PM

Kerala Government increases Excise Duty on liquor for Flood Relief

తిరువనంతపురం: వందేళ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షాలు, వరదలతో గాడ్స్ ఓన్ కంట్రీ కేరళ అతలాకుతలం అవుతున్నది. ఇప్పటికే 167 మంది మృత్యువాత పడ్డారు. వేల మంది ముంపునకు గురై పురావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. టూరిజంపై ఎక్కువగా ఆధారపడే కేరళ.. ఈ వరదల కారణంగా భారీగా ఆదాయం కోల్పోయింది. దీనికి తోడు వరదల వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. ఆ వరద బాధితులను ఆదుకోవడానికే కేరళ ప్రభుత్వం భారీగా ఖర్చు చేయాల్సి వస్తున్నది. దీంతో ఆ ఖర్చును మరో విధంగా పూడ్చుకోవడానికి అక్కడి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. దీనికోసం మద్యంపై ఎక్సైజ్ డ్యూటీని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ వెల్లడించారు.

వరద బాధితుల సహాయం, పునరావాసం కోసం కావాల్సిన అదనపు నిధుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలో కాస్త ఆర్థిక ఇబ్బంది ఉన్న మాట వాస్తవం. దానిని అధిగమించాలి. సీఎం విపత్తు సహాయక నిధికి మరిన్ని నిధులు అవసరమయ్యాయి. దీనికోసం వంద రోజుల పాటు మద్యంపై 0.5 నుంచి 3.5 శాతం వరకు ఎక్సైజ్ డ్యూటీ పెంచుతున్నాం. దీనివల్ల అదనంగా రూ.230 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నాం అని ఐజాక్ తెలిపారు. వరదల కారణంగా రూ.8 వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు కేరళ ప్రభుత్వం అంచనా వేస్తున్నది.

2711
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles