కేరళ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లకు రూ.30 ఉచిత టాక్‌టైం, డేటా..!

Thu,August 16, 2018 04:25 PM

Kerala Floods Airtel Giving Free Data and Rs 30 Talk Time

తిరువనంతపురం: కేరళలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడి ప్రజలు సతమతవుతున్న విషయం తెలిసిందే. వరదల కారణంగా పలువురు మృత్యువాత పడగా, కొన్ని వేల మంది నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలో పలు జిల్లాల్లో కేరళ ప్రభుత్వం ఇప్పటికే రెడ్ అలర్ట్‌ను కూడా ప్రకటించింది. కాగా ఆ రాష్ట్రంలో టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్లకు రూ.30 ఉచిత టాక్‌టైంతోపాటు 1జీబీ మొబైల్ డేటాను కూడా ఉచితంగా అందిస్తున్నది. వీటికి 7 రోజుల వాలిడిటీ ఇస్తున్నది.

ఇక పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు బిల్లు చెల్లింపు గడువు తేదీని పొడిగించినట్లు ఎయిర్‌టెల్ తెలిపింది. అలాగే తన కస్టమర్లకు ఉచిత వైఫై కాలింగ్ సదుపాయాన్ని కూడా అందిస్తున్నామని ఎయిర్‌టెల్ తెలియజేసింది. ఆ రాష్ట్రంలో ఉన్న 30 ఎయిర్‌టెల్ స్టోర్స్‌కు కస్టమర్లు వచ్చి తమ మొబైల్ ఫోన్లను ఉచితంగా చార్జింగ్ పెట్టుకోవచ్చని, తమ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఉచితంగా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చని ఎయిర్‌టెల్ ప్రతినిధి ఒకరు తెలిపారు. కేరళలోని త్రిసూర్, కాలికట్, మళప్పురం, కన్నూర్, కొట్టాయం, తిరువనంతపురం, ఎర్నాకులం తదితర ప్రాంతాల్లో ఎయిర్‌టెల్ స్టోర్లు ఉన్నాయి.

584
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles