పెళ్లి ఆహ్వాన పత్రికకు ఫిదా అయిన శశిథరూర్.. వైరల్ ఫోటోలు

Sat,December 15, 2018 05:31 PM

Kerala Couple Wedding Card Goes Viral

అది పెళ్లి ఆహ్వాన పత్రికే. కానీ.. వెరైటీ పత్రిక. ఈ మధ్య పెళ్లిని కూడా వింతగా, స్పెషల్‌గా, వెరైటీగా జరుపుకుంటున్నారు నేటి యువత. పెళ్లిలోని ప్రతి అంశం కొత్తగా, వినూత్నంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. తాజాగా కేర‌ళ‌కు చెందిన ఓ జంట తమ పెళ్లి ఆహ్వాన పత్రికను వెరైటీగా తయారు చేయించింది. వాళ్ల పెళ్లి ఆహ్వాన పత్రికను ఆ జంట తమ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. అది కాంగ్రెస్ లీడర్ శశిథరూర్‌కు కనిపించడంతో ఆ పెళ్లి పత్రికను చూసి ఫిదా అయిపోయాడు.

ఇంతకీ.. ఏంటా పెళ్లి పత్రిక? ఏంది దాంట్లో స్పెషల్ అంటారా? మీరు పైన చూస్తున్న ఫోటో కూడా పెళ్లి పత్రికలో భాగమే. ఏమీ అర్థం కావడం లేదు కదా? కాసింత కెమిస్ట్రీ తెలిసినవాళ్లకయితే.. ఆ పెళ్లి పత్రిక అర్థమవుతుంది. ఎస్.. వాళ్లు కెమిస్ట్రీని బేస్ చేసుకొని తమ పెళ్లి పత్రికను డిజైన్ చేయించారు. ఆర్గానిక్ కెమిస్ట్రీ, ల్యాబ్, ఆటమ్స్, కెమికల్ బాండింగ్.. ఇలా కెమిస్ట్రీ ఇతివృత్తంతో తమ పెళ్లి పత్రికను అచ్చేయించారు. అందుకే శశిథరూర్ ఆ పెళ్లి పత్రికను చూసి ఫిదా అయిపోయాడు. ఆ పెళ్లి ప‌త్రిక‌ను షేర్ చేసి మ‌రీ.. వాళ్లకు పెళ్లి శుభాకాంక్షలు చెప్పాడు.

అస‌లు ఈ కెమిస్ట్రీ గోల ఏందిరా బాబు అంటారా? ఆ పెళ్లి కూతురు కెమిస్ట్రీ టీచ‌ర్ అట‌. ఆమె పేరు సూర్య వితున్ నాయ‌ర్‌. ఆమె కెమిస్ట్రీ టీచ‌ర్ కాబ‌ట్టే ఇలా వింత‌గా.. కెమిస్ట్రీని బేస్ చేసుకొని వెడ్డింగ్ ఇన్విటేష‌న్‌ను త‌యారు చేయించింది.


3395
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles