కేర‌ళ నుంచి రాహుల్ గాంధీ పోటీ !

Sat,March 23, 2019 02:38 PM

Kerala Congress asks Rahul Gandhi to contest from Wayanad

హైద‌రాబాద్: కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ.. ద‌క్షిణాది నుంచి పోటీ చేయాల‌న్న డిమాండ్ పెరుగుతున్న విష‌యం తెలిసిందే. అయితే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కేర‌ళ‌లోని వ‌య‌నాడ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి రాహుల్ పోటీ చేస్తార‌న్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేర‌ళ‌లోని ఓ స్థానం నుంచి పోటీ చేయాల‌ని అఖిల భార‌త కాంగ్రెస్ క‌మిటీ కార్య‌ద‌ర్శి ఒమ‌న్ చాందీ.. కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్‌ను కోరిన‌ట్లు తెలుస్తోంది. అయితే దీనిపై రాహుల్ ఇవాళ త‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించే అవ‌కాశాలు ఉన్నాయి. క‌ర్నాట‌క నుంచి కూడా పోటీ చేయాల‌ని ఆ రాష్ట్ర పార్టీ చీఫ్ దినేశ్ గుండూ రావు కూడా రాహుల్‌ను అభ్య‌ర్థించారు. కానీ రాహుల్ మాత్రం వ‌య‌నాడ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసేందుకు నిరాక‌రించిన‌ట్లు తెలుస్తోంది. తాను కేవ‌లం అమేథీ నుంచి మాత్ర‌మే పోటీ చేస్తాన‌ని రాహుల్ అన్నారు.

1094
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles