విద్యార్థిపై సీనియర్ల ర్యాగింగ్..

Fri,September 7, 2018 06:50 PM

Kerala College student beaten up by seniors alleges ragging

కేరళ: ఓ ప్రైవేట్ కాలేజీలో బీకాం మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిపై సీనియర్లు ర్యాగింగ్ పేరుతో దాడికి పాల్పడ్డారు. సెప్టెంబర్ 5న ఇడుక్కి జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సెకండియర్ చదువుతున్న ఐదుగురు సీనియర్లు వాగమోన్ క్యాంపస్ కాలేజీలో అతుల్ మోహన్ (23)అనే జూనియర్ విద్యార్థిపై దాడి చేయడంతో అతనికి గాయాలయ్యాయి. బాధిత విద్యార్థిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాలేజీ యాజమాన్యం దాడికి కారణమైన ఐదుగురు విద్యార్థులను సస్పెండ్ చేసింది.

వ్యక్తిగత కారణాల వల్ల సీనియర్లు సదరు విద్యార్థిపై దాడికి పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తుండగా..తనపై సీనియర్లు ర్యాగింగ్ పాల్పడ్డారని బాధిత విద్యార్థి చెబుతున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. హెచ్‌ఆర్‌డీ మినిస్ట్రీ ఆదేశాల ప్రకారం అన్ని విద్యాసంస్థలు, కాలేజీలు, స్కూళ్లలో ర్యాగింగ్‌పై నిషేధం అమలులో ఉన్న విషయం తెలిసిందే.

7409
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles