సీఎం విజ‌య‌న్‌.. ఓ మాడ్ర‌న్ ఔరంగ‌జేబు

Wed,January 2, 2019 02:08 PM

Kerala CM Vijayan is modern Aurangzeb, alleges BJP state president P S Sreedharan Pillai

తిరువ‌నంత‌పురం: కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్‌పై.. ఆ రాష్ట్ర బీజేపీ తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది. సీఎం విజ‌య‌న్ ఓ మాడ్ర‌న్ ఔరంగ‌జేబు అని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు పీఎస్ శ్రీధ‌ర‌న్ పిళ్లై ఆరోపించారు. నాస్తిక‌త్వ పోక‌డ‌లు పోతున్న విజ‌య‌న్ భారీ మూల్యం చెల్లించుకుంటార‌ని అన్నారు. 50 ఏళ్ల లోపు వ‌య‌సు ఉన్న ఇద్ద‌రు మ‌హిళ‌లు ఇవాళ తెల్ల‌వారుజామున శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప‌స్వామిని ద‌ర్శించుకున్నారు. ఈ నేప‌థ్యంలో ఆ రాష్ట్ర బీజేపీ.. సీఎం విజ‌య‌న్‌ను త‌ప్పుప‌ట్టింది. మ‌త‌విశ్వాసం ఉన్న‌వారి మ‌నోభ‌వాల‌ను సీఎం దెబ్బ‌తీశార‌ని, సీఎం విజ‌య‌న్ మొఘ‌ల్ చ‌క్ర‌వ‌ర్తి ఔరంగ‌జేబు త‌ర‌హాలో ప్ర‌వ‌ర్తించార‌ని, ముస్లిం మ‌తానికి చెందని వారిపై ఔరంగ‌జేబు జియా ట్యాక్స్ వ‌సూల్ చేసేవార‌ని శ్రీధ‌ర‌న్ ఆరోపించారు. అయ్య‌ప్ప ధ‌ర్మ‌సేన స‌మితి అధ్య‌క్షుడు రాహ‌ల్ ఈశ్వర్ కూడా స్పందించారు. మ‌హిళ‌ల‌కు కేర‌ళ పోలీసులే ర‌క్ష‌ణ‌గా నిలిచార‌న్నారు. ర‌హ‌స్యంగా పోలీసులు మ‌హిళ‌ల‌కు అండ‌గా నిల‌వ‌డం దారుణ‌మ‌న్నారు. మ‌హిళ‌ల ప్ర‌వేశం త‌ర్వాత ఆల‌యంలో సంప్రోక్ష‌ణ చేప‌ట్ట‌డాన్ని సీపీఎం త‌ప్పుప‌ట్టింది. సుప్రీం తీర్పును అగౌర‌వ ప‌రిచార‌ని ఆ పార్టీ ఆరోపించింది.

1535
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles