శబరిమల: కోర్టు తీర్పును గౌరవిస్తాం.. మహిళలకు సౌకర్యాలు కల్పిస్తాం

Wed,October 3, 2018 02:36 PM

KERALA CM SAYS HIS GOVT WILL PROVIDE FACILITIES AND PROTECTION TO WOMEN DEVOTEES AT SABARIMALA

శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని, అక్కడ మహిళలకు తగిన సౌకర్యాలు కల్పిస్తామని కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ప్రకటించారు. కోర్టు తీర్పుపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. కొందరు ప్రగతిశీలమైన తీర్పు అంటూ మెచ్చుకుంటుంటే మరికొందరేమో ఆచారాలను రూపుమాపుతారా? అని మండిపడుతున్నారు. మంగళవారం పండాలంలో సుమారు 8 వేల మంది మహిళలు తీర్పుకు నిరసనగా ప్రదర్శన జరిపారు. తిరువాన్కూర్ దేవస్వం బోర్డు కూడా తీర్పుపై అసంతృప్తి ప్రకటించింది.

కానీ రివ్యూ పిటిషన్ గురించి మాత్రం ఏమీ చెప్పలేదు. 10 నుంచి 50 సంవత్సరాల వయసుగల మహిళల ప్రవేశంపై నిషేధాన్ని సమర్థించిన రాహుల్ ఈశ్వర్ వంటి సామాజిక కార్యకర్తలు తీర్పును సవాల్ చేయాలని భావిస్తున్నారు. కానీ కేరళ ప్రభుత్వానికి ఇలాంటి ఉద్దేశాలు ఏవీ లేవు. తమ ప్రబుతివం ఎలాంటి రివ్యూ పిటిషన్ వేయదని సీఎం విజయన్ స్పష్టం చేశారు. మహిళాభక్తులకు భద్రత కల్పిస్తామని, కేరళ పోలీసులతోపాటు పొరుగురాష్ర్టాల నుంచి బలగాలను నియోగిస్తామని చెప్పారు. భక్తులను మొదటినుంచీ విభజిస్తున్నారని, సుప్రీంకోర్టు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని తీర్పు చెప్పిందని అన్నారు. శబరిమలకు వెళ్లే ఏ మహిళనూ ఆపబోమని కేరళ సీఎం పేర్కొన్నారు.

1393
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles