ఆయన వల్లే ఓడిపోయాం.. ఆయనలో కాంగ్రెస్ రక్తం లేదు!

Wed,May 16, 2018 05:16 PM

Keep Siddharamiah out of Congress says Outgoing Speaker KB Koliwad

బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ ఓడిపోగానే సిద్ధరామయ్యపై ఉన్న అసంతృప్తి బయపడుతున్నది. సాక్షాత్తూ ఇన్నాళ్లూ అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్న కేబీ కొలివాడే ఆయన తీరును చీల్చి చెండాడారు. కాంగ్రెస్ ఓడిపోవడానికి సిద్ధరామయ్యే కారణమని కొలివాడ్ తేల్చి చెప్పారు. అసలు ఆయనలో ఏమాత్రం కాంగ్రెస్ రక్తం లేదు. వొక్కలిగాలతో వైరం పెంచాడు. లింగాయత్‌లను దూరం చేశాడు. అతని వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇవన్నీ చేశాడు. చివరికి పార్టీ తీవ్రంగా నష్టపోయింది అంటూ కొలివాడ్ తీవ్రంగా మండిపడ్డారు.

రానెబెన్నూర్ నుంచి పోటీ చేసిన కొలివాడ్ 6 వేల ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు. సిద్ధరామయ్యే కావాలని ఓ స్వతంత్ర అభ్యర్థిని నిలబెట్టారని, అందుకే తాను ఓడిపోయానని ఆయన చెప్పారు. ఇప్పుడా స్వతంత్ర అభ్యర్థి వెళ్లి బీజేపీలో చేరడం గమనార్హం. కర్ణాటకలో కాంగ్రెస్‌ను మొత్తం సిద్ధరామయ్య నాశనం చేశారని కొలివాడ్ అన్నారు. సిద్ధరామయ్య ప్రవర్తన, భాష.. అన్నీ కాంగ్రెస్‌కు తీరని నష్టం చేశాయని విమర్శించారు.

సిద్ధరామయ్యను కాంగ్రెస్‌లోకి తీసుకోవాల్సింది కాదు. ఆయన తన పాత జేడీఎస్ మిత్రులను బాగా ప్రోత్సహించి అసలుసిసలు కాంగ్రెస్ నేతలను పక్కన పెట్టేశారు అని కొలివాడ్ ఆరోపించారు. ఒకవేళ సిద్ధరామయ్య రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యతలు చేపడితే అది పార్టీకి ఆత్మహత్యాసదృశమే అవుతుందని కొలివాడ్ స్పష్టంచేశారు. ఆయన్ని పక్కన పెట్టి కాంగ్రెస్‌ను పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని కొలివాడ్ అన్నారు.

5603
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles