పాకిస్థాన్‌కు కశ్మీరీ యువత గట్టి సందేశం

Wed,February 20, 2019 05:52 PM

Kashmiri Youth sign up for Army in record numbers

శ్రీనగర్: కశ్మీరీ యువత తుపాకులు పట్టుకోవడానికి పోటెత్తింది. అయితే అది ఉగ్రవాదులుగా మారడానికి కాదు. భారత సైన్యంలో భాగమై ఆ ఉగ్రవాదుల పీచమణచడానికి. పుల్వామా దాడి జరిగిన ఆరు రోజుల తర్వాత జమ్ముకశ్మీర్‌లో నిర్వహించిన ఆర్మీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కు పెద్ద ఎత్తున యువత హాజరయ్యారు. మొత్తం 111 ఖాళీలు ఉండగా.. 3 వేల మందికిపైగా యువకులు ఈ ఎంపిక ప్రక్రియకు హాజరు కావడం విశేషం. మంగళవారం మొదలైన ఈ ప్రక్రియ శుక్రవారం వరకు కొనసాగనుంది. బారాముల్లా, కుప్వారా, బందీపొరా జిల్లాలకు చెందిన నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఉద్యోగం కోసమే కాదు దేశ రక్షణలో భాగం కావడానికి వీళ్లు ఉవ్విళ్లూరుతున్నారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కు పెద్ద ఎత్తున తరలిరావడం ద్వారా కశ్మీరీ యువత పరోక్షంగా పాకిస్థాన్‌కు గట్టి సందేశం ఇచ్చినట్లయింది. ప్రభుత్వం ఆర్మీలో మరిన్ని ఉద్యోగాలు ఇవ్వాలని అక్కడి యువత డిమాండ్ చేస్తున్నది. బారాముల్లాలో ప్రస్తుతం ఈ డ్రైవ్ నడుస్తుండగా.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించాలని కోరుతున్నది.

4800
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles