కశ్మీరీ విద్యార్థులు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేయొద్దు..

Sun,February 17, 2019 03:43 PM

Kashmiri students to not issue statements in Social media

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ లో విద్యనభ్యసిస్తున్న కశ్మీరీ విద్యార్థులు సోషల్ మీడియాలో ఎలాంటి ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేయరాదని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అశోక్ కుమార్ సూచించారు. జమ్మూకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ లో ఉన్న కశ్మీర్ విద్యార్థులు తమ భద్రతపై ఎలాంటి ఆందోళన చెందవద్దని కోరారు.

పోలీసులు కశ్మీరీ విద్యార్థులకు పూర్తి భద్రత కల్సిస్తారని అశోక్ కుమార్ చెప్పారు. కొంతమంది కశ్మీరీ విద్యార్థినిలు భయాందోళనతో గదులకు తాళాలు వేసుకుని లోపల ఉన్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అశోక్ కుమార్ పైవిధంగా స్పందించారు. స్థానికులు నిర్వహించిన క్యాండిల్ మార్చ్ ర్యాలీలో కొంతమంది కశ్మీరీ విద్యార్థినిలు భారత్ కు వత్యిరేకంగా నినాదాలు చేశారని, దీంతో పోలీసులు అక్కడికెళ్లి పరిస్థితులను చక్కదిద్దారని తెలిపారు.

2913
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles