ఉగ్రవాద సంస్థలో చేరిన 17 ఏళ్ల విద్యార్థి

Sat,November 3, 2018 12:12 PM

Kashmiri Student bilal Sofi Missing From Noida Seen With ISIS Flag On Social Media

న్యూఢిల్లీ : కశ్మీర్‌కు చెందిన ఓ డిగ్రీ విద్యార్థి.. ఉగ్రవాద సంస్థలో చేరాడు. గ్రేటర్ నోయిడాలోని శారద యూనివర్సిటీలో కశ్మీర్‌కు చెందిన అహ్‌తేషమ్ బిలాల్ సోఫి(17) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే అక్టోబర్ 28న ఉదయం ఢిల్లీకి వెళ్తున్నాని చెప్పి.. అధ్యాపకుల అనుమతి తీసుకొని యూనివర్సిటీ నుంచి బయల్దేరాడు. మరుసటి రోజు ఉదయం వరకు కూడా సదరు విద్యార్థి తిరిగి రాకపోవడంతో యూనివర్సిటీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బిలాల్ సోఫి ఫోన్ నంబర్‌ను ట్రేస్ చేయగా.. అతను కశ్మీర్‌లో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. అక్టోబర్ 29న సాయంత్రం 4:30 గంటలకు సోఫి తన తండ్రితో ఫోన్ మాట్లాడి స్విచ్ఛాఫ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఓ ఉగ్రవాదలో సంస్థలో చేరాడు సోఫి. అయితే సోఫి ఉగ్రవాద సంస్థలో చేరిన ఫోటోలు సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారాయి.

1358
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles