అఫ్రిది నిజ‌మే చెప్పాడు: రాజ్‌నాథ్ సింగ్‌

Thu,November 15, 2018 10:56 AM

Kashmir is integral part of India, says Rajnath Singh

న్యూఢిల్లీ: దేశంలో ఉన్న నాలుగు ప్రావిన్స్‌లనే సరిగా చూసుకోలేకపోతున్నాం.. ఇక పాకిస్థాన్‌కు కశ్మీర్ ఎందుకు అని ఆ దేశ క్రికెట‌ర్ షాహిద్ అఫ్రిది కామెంట్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ వ్యాఖ్య‌ల ప‌ట్ల కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. అఫ్రిది నిజ‌మే చెప్పాడు అని, పాక్ త‌మ దేశాన్నే చూసుకోలేక‌పోతున్న‌ది, ఇక క‌శ్మీర్‌ను ఏం చూసుకుంటుంద‌ని రాజ్‌నాథ్ అన్నారు. క‌శ్మీర్‌లో భార‌త్‌కు చెందిన భూభాగం అని, ఎప్ప‌టికీ ఇక్క‌డే ఉంటుంద‌ని కేంద్ర హోంమంత్రి తెలిపారు. ఇటీవ‌ల బ్రిటిష్ పార్లమెంట్‌లో విద్యార్థులతో మాట్లాడుతున్న సందర్భంగా కశ్మీర్‌ను వదిలేయండి.. ఉన్న ప్రాంతాన్ని సరిగ్గా చూసుకోండి అని పాక్ ప్రభుత్వాన్ని అఫ్రిది డిమాండ్ చేశాడు. అఫ్రిది చేసిన ఈ వ్యాఖ్యలు వివాదానికి దారి తీసే పరిస్థితి కనిపిస్తున్నది. ఉగ్రవాదుల నుంచి దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి కూడా తమ ప్రభుత్వాలకు చేత కాలేదని అతను విమర్శించాడు.2126
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles