జయలలిత సమాధి పక్కనే..

Wed,August 8, 2018 03:17 PM

Karunanidhi to be buried beside Jayalalitha

చెన్నై: వాళ్లిద్దరూ తమిళ రాజకీయాల్లో బద్ధ శత్రువులు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత శతృత్వం ఇద్దరి మధ్య ఉంది. అలాంటిది ఇప్పుడు ఆ జయలలిత సమాధి పక్కనే కరుణానిధి కూడా శాశ్వతంగా విశ్రాంతి తీసుకోబోతున్నారు. డీఎంకే పార్టీ దగ్గర ఉన్న ప్లాన్ ప్రకారం కరుణానిధిని ఖననం చేసే చోటు ఆయన గురువు అన్నాదురై, జయలలిత సమాధుల మధ్య ఉంది. మొదట్లో మరీనా బీచ్‌లో కరుణానిధి ఖననానికి తమిళనాడు ప్రభుత్వం అంగీకరించని విషయం తెలిసిందే. దీంతో డీఎంకే మద్రాస్ హైకోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకుంది. డీఎంకేకు చెందిన ఆరెస్ భారతి ఇచ్చిన ప్లాన్ ప్రకారమే ఖననం చేయాలని కూడా కోర్టు ఆదేశించింది. తమిళ రాజకీయాల్లో కరుణానిధి, జయలలిత మధ్య దశాబ్దాల పాటు వైరం కొనసాగింది. ఇప్పుడు వైరిపక్షం అన్నాడీఎంకేనే అధికారంలో ఉండటం, మెరీనా బీచ్‌లో ఖననానికి అనుమతి ఇవ్వకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. గాంధీ మండపం దగ్గర ప్రత్యేకంగా రెండెకరాల స్థలం ఇస్తామని ప్రభుత్వం ప్రతిపాదించినా డీఎంకే అంగీకరించలేదు.

3195
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles