కరుణానిధి, అన్నాదురై విగ్రహాల ఆవిష్కరణ… హాజరుకానున్న ప్ర‌ముఖులు

Sun,December 16, 2018 12:39 PM

Karunanidhi statue to be unveiled at DMK HQ

చెన్నై: దివంగత డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఇవాళ సాయంత్రం 5 గంటలకు చెన్నైలో జరగనుంది. డీఎంకే కార్యాలయంలో అన్నాదురై, కరుణానిధి విగ్రహాల ఆవిష్కరణకు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఆహ్వానం మేరకు ఆవిష్కరణ కార్యక్రమానికి యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీలతో పాటు కేరళ సీఎం పినరయి విజయన్, పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి, శరద్‌పవార్ తదితరులు హాజరుకానున్నారు. ప్రముఖ సినీనటులు కమల్‌హాసన్, రజనీకాంత్‌లను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. అనంతరం మెరీనా బీచ్‌లో కరుణానిధి సమాధి వద్ద నేతలు నివాళులర్పించనున్నారు. ఆ తర్వాత రాయపేటలోని వైఎంసీఏ మైదానంలో బహిరంగ సభలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తదితరులు పాల్గొంటారు.

1930
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles