సాయంత్రం 5 గంటల నుంచి కరుణ అంతిమయాత్ర ప్రారంభం

Wed,August 8, 2018 01:11 PM

Karunanidhi final procession to start from 5 pm on wards

చెన్నై: తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి అంతిమయాత్ర సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభం కానుంది. రాజాజీ హాల్ నుంచి మరీనా బీచ్ వరకు ఈ అంతిమయాత్ర ఉంటుంది. వాలాజా రోడ్, చెపాక్ స్టేడియం మీదుగా యాత్ర సాగనుంది. సాయంత్రం 6 గంటలకు మరీనా బీచ్‌లోని అన్నా స్వేర్ ప్రాంగణంలో ప్రభుత్వ లాంఛనాలతో అంతమ సంస్కారాలు నిర్వహించనున్నారు. రాజాజీ హాలులో ఉన్న కరుణానిధి పార్థివదేహాన్ని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించి నివాళులు అర్పించారు. తమ ప్రియతమ నేతను చివరిసారి చూసేందుకు వేలాది మంది అభిమానులు రాజాజీ హాలుకు తరలి వస్తున్నారు.
770
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles