రాజాజీ హాల్‌ను చుట్టుముట్టిన అభిమానులు

Wed,August 8, 2018 01:24 PM

Karunanidhi fans throng Rajaji Memorial

చెన్నై: తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి పార్దీవ దేహాన్ని .. చెన్నైలోని రాజాజీ మెమోరియల్‌లో ప్రజల సందర్శన కోసం ఉంచారు. అయితే తమ ప్రియతమ నేతను చివరిసారి చూసేందుకు తమిళ ప్రజలు అధిక సంఖ్యలో వస్తున్నారు. రాజాజీ హాల్ చుట్టూ లక్షల్లో అభిమానులు చేరుకున్నారు. బ్యారికేడ్లను ఎక్కి జనం .. హాల్‌లోకి ప్రవేశిస్తున్నారు. ఉప్పెనలా వస్తున్న అభిమానుల్ని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. డీఎంకే నేతలు కూడా అభిమానుల్ని శాంతిపచేస్తున్నారు. రాజాజీ హాల్ పక్కన ఉన్న గవర్నర్ హాస్పటల్ ఎక్కి మరీ.. కరుణ పార్ధీవదేహాన్ని చూసేందుకు జనం వస్తున్నారు. సంయమనం పాటించాలని చెన్నై మాజీ మేయర్ సుబ్రమణ్యం ప్రజలను కోరారు.

1301
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles