54 కోట్ల కార్తీ ఆస్తులు జప్తు

Thu,October 11, 2018 11:33 AM

Karti Chidambarams assets worth Rs 54 crores seized

న్యూఢిల్లీ: కార్తీ చిదంబరానికి చెందిన 54 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ సీజ్ చేసింది. భారత్‌తో పాటు యూకే, స్పెయిన్‌లో ఉన్న ఆస్తులను ఈడీ జప్తు చేసింది. మనీల్యాండరింగ్ కేసులో ఈడీ ఈ చర్యకు పూనుకున్నది. ఐఎన్ఎక్స్ మీడియా కోసం కార్తీ అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. సీనియ‌ర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి పీ. చిదంబ‌రం కుమారుడైన కార్తీ చిదంబ‌రం.. ఐఎన్ఎక్స్ మీడియా సంస్థకు అక్ర‌మ ప‌ద్ధ‌తిలో సుమారు 300 కోట్ల మేర‌కు విదేశీ పెట్టుబ‌డులు తీసుకువ‌చ్చిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఎఫ్‌డీ ఇన్వెస్ట్‌మెంట్ కోసం కార్తీ ప్ర‌భుత్వ క్లియ‌రెన్స్ తీసుకువచ్చారు. ఆర్థిక మంత్రి హోదాలో ఉన్న తండ్రి చిదంబ‌రం నుంచి ఆ అనుమ‌తులు వ‌చ్చేలా కార్తీ ప్ర‌య‌త్నించిన‌ట్లు తెలుస్తోంది.

1197
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles