చిప్పకూడు వద్దు.. స్విగ్గీలో ఆర్డర్ చేయండి!

Fri,March 2, 2018 02:45 PM

Karthi Chidambaram wants food from Swiggy or Zomato says Report

న్యూఢిల్లీః ఐఎన్‌ఎక్స్ కేసులో ఐదు రోజుల సీబీఐ కస్టడీలో ఉన్న కార్తి చిదంబరం నోటికి పని చెబుతున్నారు. కస్టడీలో ఉన్నా.. అక్కడి అధికారులను తిడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తనకు ఇంటి నుంచి భోజనం తెప్పించాల్సిందిగా ఆయన కోరినా.. పటియాలా హౌజ్ కోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో తనకు స్విగ్గీ లేదా జొమాటోలో ఆర్డర్ చేయాలని ఆయన డిమాండ్ చేయడం గమనార్హం. దానికి అధికారులు అభ్యంతరం చెబితే.. వారిని నోటికొచ్చినట్లు తిడుతున్నారట. ఈ కేసులో కార్తికి ఐదు రోజుల సీబీఐ కస్టడీ విధించిన విషయం తెలిసిందే. మార్చి 6 వరకు ఆయన కస్టడీలోనే ఉండనున్నారు. వైద్యుల సూచనల మేరకు మందులు, ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఒక్కో గంట లాయర్‌ను కలిసేందుకు అనుమతి మాత్రం ఇచ్చారు.

2454
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles