కర్ణాటక సభలో హైడ్రామా..శాసనసభ రేపటికి వాయిదా

Thu,July 18, 2019 09:10 PM

karnataka vidhan sabha adjourned tomorrow


బెంగళూరు: కర్ణాటక శాసనసభ రేపటికి వాయిదా పడింది. కాంగ్రెస్‌-జేడీఎస్‌ సభ్యుల ఆందోళనతో విధానసభను రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తూ స్పీకర్‌ కేఆర్‌ రమేశ్‌ కుమార్‌ నిర్ణయం తీసుకున్నారు. సభ ప్రారంభం కాగానే -జేడీఎస్‌ సభ్యులు ఆందోళనకు దిగారు. బీజేపీ తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతుందని కాంగ్రెస్‌ సభ్యులు స్పీకర్‌ పోడియం వద్ద ప్లకార్డులు ప్రదర్శించారు. సభ సజావుగా సాగకపోవడంతో స్పీకర్‌ సభను రేపటికి వాయిదా వేశారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు.

గవర్నర్‌ బలపరీక్ష జరపాలని చెప్పినా స్పీకర్‌ సభను ఎలా వాయిదా వేస్తారని బీజేపీ నేత యడ్యూరప్ప ప్రశ్నించారు. సభను వాయిదా వేస్తే రాత్రంతా సభలోనే ఉండి ధర్నా చేస్తామని యడ్యూరప్ప స్పష్టం చేశారు. ఇక మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలు సభలోనే ఉండి ధర్నా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక సీఎం కుమారస్వామి, స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ రేపు సుప్రీంక్ట్రోను ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. విప్‌పై స్పష్టత ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం.

469
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles