సరైన ఫార్మాట్‌లో రాజీనామాలు సమర్పించారు: స్పీకర్‌ కేఆర్‌ రమేశ్‌కుమార్‌

Thu,July 11, 2019 07:42 PM

karnataka speaker kr suresh kumar address a pressmeet


బెంగళూరు : ఎమ్మెల్యేలు సరైన ఫార్మాట్‌లో తనకు రాజీనామాలు సమర్పించారని కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌ కేఆర్‌ రమేశ్‌కుమార్‌ వెల్లడించారు. కాంగ్రెస్‌, జేడీ(ఎస్‌) అసమ్మతి ఎమ్మెల్యేలు ఇవాళ సాయంత్రం స్పీకర్‌ ఫార్మాట్‌ లో రాజీనామాలు సమర్పించారు. అనంతరం స్పీకర్‌ కేఆర్‌ రమేశ్‌ కుమార్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాజీనామాలపై ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నాననే వార్తలు తనను బాధించాయని స్పీకర్‌ అన్నారు.

గవర్నర్‌ నాకు ఆరో తేదీన సమాచారం ఇచ్చారు. జులై 6న మధ్యాహ్నం 1.30 గంటల వరకు నా ఛాంబర్‌లోనే ఉన్నాను. ఎమ్మెల్యేలు నేను వెళ్లిన తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు ఆఫీసుకు వచ్చారు. అంతకుముందు నన్ను కలుస్తానని ఏ ఎమ్మెల్యే అపాయింట్‌ మెంట్‌ తీసుకోలేదు. నేను ఎమ్మెల్యేలు వస్తున్నారని తెలిసి ఆఫీసు నుంచి వెళ్లిపోయాననే మాట అవాస్తమని స్పీకర్‌ కేఆర్‌ రమేశ్‌ కుమార్‌ స్పష్టం చేశారు.

రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో రాజీనామాల స్వీకరణ అంశమంతా వీడియో తీశాం. సుప్రీంకోర్టుకు దీనిపై నివేదిక పంపిస్తామన్నారు. గతంలో ఇచ్చిన వాటిలో 8 రాజీనామాలు స్పీకర్‌ ఫార్మాట్‌లో లేవు. కొంతమంది తమను బెదిరిస్తుండటం వల్ల భయంతో తాము ముంబైకి వెళ్లామని రెబల్ ఎమ్మెల్యేలు నాతో చెప్పారు. కానీ వాళ్లు నా దగ్గరికి వస్తే నేను రక్షణ కల్పిస్తానని చెప్పాను. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే ఎమ్మెల్యేలంతా ఆందోళనకర వాతావరణాన్ని సృష్టించారని స్పీకర్ రమేశ్ కుమార్ చెప్పారు.

1679
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles