ఎంపీలకు ఐఫోన్లు గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి!

Wed,July 18, 2018 12:23 PM

Karnataka MPs get costly iPhones from a Minister

బెంగళూరు: కర్ణాటకకు చెందిన మంత్రి ఆ రాష్ట్ర ఎంపీలకు ఖరీదైన ఐఫోన్లు గిఫ్ట్‌గా ఇచ్చారు. దీనిపై ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి. ఇది సిగ్గుచేటు అని బీజేపీ విమర్శించింది. అయితే ఈ విషయం తనకు తెలియదని ముఖ్యమంత్రి కుమారస్వామి చెప్పడం గమనార్హం. మంత్రి డీకే శివకుమార్ ఈ ఫోన్లను ఎంపీలకు ఇచ్చారు. పార్లమెంట్ సెషన్‌లో భాగంగా కర్ణాటక తరఫున లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించేందుకు సీఎం కుమారస్వామి ఢిల్లీలో 40 మంది రాష్ట్ర ఎంపీలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ముందే ఆ 40 మందికి ఖరీదైన ఐఫోన్లను అందజేశారు.

దీనిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. తన ఎంపీలకు ఖరీదైన గిఫ్ట్‌లు ఇవ్వడానికి కుమారస్వామి దగ్గర డబ్బులున్నాయిగానీ.. రైతుల రుణాల మాఫీ చేయరు. విద్యార్థులకు ఉచిత బస్‌పాస్‌లు ఇవ్వరు. కోస్తా, ఉత్తర కర్ణాటక అభివృద్ధిని నిధులు ఇవ్వరు. ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు అని కర్ణాటక బీజేపీ ట్వీట్ చేసింది. తనకు ఇచ్చిన గిఫ్ట్‌ను తిరిగి ఇచ్చేస్తున్నట్లు బీజేపీ రాజ్యసభ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్.. కుమారస్వామికి లేఖ రాసిన తర్వాత బీజేపీ ఈ ట్వీట్ చేయడం గమనార్హం. సమావేశ వివరాలతోపాటు మీ ప్రభుత్వం ఓ ఖరీదైన ఐఫోన్‌ను కూడా పంపించింది. దీని ధర లక్షపైనే ఉంటుంది. ప్రజాధనాన్ని ఇలా ఖర్చు చేయడం సరికాదు అని ఆయన రాజీవ్ ఆ లేఖలో స్పష్టంచేశారు.


ఆ గిఫ్ట్‌కు సంబంధించిన ఫొటోను కూడా ట్వీట్ చేశారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. ఈ విషయం తనకు తెలియని చెప్పడం విశేషం. ఇలాంటి గిఫ్ట్‌లు ఇవ్వాలని ఎవరు నిర్ణయం తీసుకున్నారో తెలియదు. ముఖ్యమంత్రి కార్యాలయం మాత్రం ఈ దిశగా ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు అని కుమారస్వామి చెప్పారు. ఎవరిచ్చారో తెలుసుకొని తర్వాత ఏం చేయాలో నిర్ణయిస్తామని తెలిపారు. అయితే ఈ గిఫ్ట్‌లను తాను వ్యక్తిగతంగా ఇచ్చినట్లు మంత్రి శివకుమార్ చెప్పారు. ఏదో మర్యాదపూర్వకంగా ఈ గిఫ్ట్‌లు ఇచ్చానని, ఇవేమీ లంచాలు కాదని ఆయన అన్నారు. ఈ గిఫ్ట్‌లు అందుకున్న బీజేపీ ఎంపీలు కూడా తనకు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పినట్లు ఆయన తెలిపారు.

1868
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles