గవర్నర్‌కు రాజీనామా సమర్పించిన కుమారస్వామి

Tue,July 23, 2019 09:07 PM

Karnataka Governor Vajubhai Vala accepts HD Kumaraswamy resignation

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తన పదవికి రాజీనామా చేశారు. జేడీఎస్ - కాంగ్రెస్ ప్రభుత్వ బలపరీక్షలో ఓడిపోవడంతో అసెంబ్లీ నుంచి నేరుగా ఆయన రాజ్‌భవన్ చేరుకున్నారు. గవర్నర్ వజూభాయ్ వాలాను కలిసిన కుమారస్వామి తన రాజీనామా లేఖను అందజేశారు. కుమారస్వామి రాజీనామాను వజూభాయ్ వాలా ఆమోదించారు. అసెంబ్లీలో బలనిరూపణ పరీక్ష ఓడిపోయిన అనంతరం కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య మాట్లాడుతూ రాజ్యంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం కాంగ్రెస్ పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు విప్‌ను ఉల్లంఘించారు. వారు తమ ఎమ్మెల్యే పదవులు కోల్పోతారని పేర్కొన్నారు.

1449
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles