బెంగళూరు: పెరిగిపోతున్న పెట్రో ధరల భారం నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకుంది కర్ణాటక ప్రభుత్వం. పెట్రోల్, డీజిల్‌లపై లీటర్‌కు రూ.2 తగ్గించింది. ఏపీ, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్ తర్వాత పెట్రో ధరలను తగ్గించిన నాలుగో రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. ప్రస్తుతం బెంగళూరులో పెట్రోల్ ధర రూ.84.59గా ఉండగా.. డీజిల్ ధర రూ.76.10గా ఉంది. దీంతో లీటర్‌కు రూ.2 తగ్గించాలని తమ సంకీర్ణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కుమారస్వామి ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని మాజీ ప్రధాని, జేడీయూ అధ్యక్షుడు దేవెగౌడ స్వాగతించారు.
— H D Devegowda (@H_D_Devegowda)
September 17, 2018కొన్ని రోజులుగా రూపాయి పతనం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలకు అడ్డూఅదుపూ లేకుండా పోతున్న విషయం తెలిసిందే. మహారాష్ట్రలో అయితే ఇప్పటికే పెట్రోల్ ధర రూ.90 దాటింది. ఢిల్లీలోనూ సోమవారం రూ.82.06గా ఉంది. ఆగస్ట్ 1 నుంచి ప్రతి రోజూ పెట్రో ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కేవలం ఆగస్ట్ 13న ఒక్కరోజు మాత్రమే కాస్త తగ్గింది.