కాంగ్రెస్ గూటికే.. మిస్సైన ఎమ్మెల్యేలు..

Sat,May 19, 2018 03:42 PM

Karnataka floor test : Pratap Patil joins Congress camp

బెంగుళూరు: కనిపించకుండాపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మళ్లీ తమ గూటికి చేరుకున్నారు. రసవత్తరంగా సాగుతున్న కర్నాటక రాజకీయం ఇప్పడు మరో దశకు చేరుకున్నది. ప్రతాప్ గౌడ్ పాటిల్‌తో పాటు ఆనంద్ సింగ్‌లు .. కాసేపటి క్రితం కాంగ్రెస్ టీమ్‌లో చేరారు. నిజానికి ఇవాళ ఉదయం ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారానికి రాలేదు. ఈ ఇద్దర్నీ .. బీజేపీ నేతలు దాచిపెట్టినట్లు తెలుస్తోంది. విధాన సౌధకు ఎమ్మెల్యే ప్రతాప్ గౌడ్ వస్తున్న సమయంలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకున్నది. ఎమ్మెల్యే ప్రతాప్... కాంగ్రెస్ క్యాంపు వైపు వెళ్తుండగా.. బీజేపీ ఎమ్మెల్యే ఎస్‌ఆర్ విశ్వనాథ్.. ఆయన్ను లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. కానీ బీజేపీ క్యాంపులో కలిసేందుకు నిరాకరించిన ఎమ్మెల్యే ప్రతాప్.. కాంగ్రెస్ క్యాంపు వైపు వెళ్లారు. ఎమ్మెల్యే ఆనంద్ సింగ్‌కు కూడా కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ స్వాగతం పలికారు.

2856
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles