య‌డ్యూర‌ప్ప మిడిల్‌ డ్రాప్‌.. సీఎం ప‌ద‌వికి రాజీనామా..

Sat,May 19, 2018 04:14 PM

Karnataka CM Yeddyurappa Resigns his post,  floor test cancelled

బెంగుళూరు: కర్నాటక రాజకీయ సంక్షోభం ఊహించనీ రీతిలో ముగిసింది. ఉత్కంఠంగా సాగిన బలపరీక్ష ఎపిసోడ్‌కు సీఎం యడ్యూరప్పే ఫుల్‌స్టాప్ పెట్టారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు సీఎం యడ్యూరప్ప.. అసెంబ్లీలో ప్రకటించారు. విశ్వాస పరీక్ష తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత యడ్డీ మాట్లాడారు. అధికారాన్ని కోల్పోయినంత మాత్రానా తానేమీ కోల్పోలేదని ఆయన అన్నారు. ప్రజల కోసమే తన జీవితమని సిద్దూ తెలిపారు. మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకునేందుకు తెగ ప్రయత్నాలు చేసిన బీజేపీకి ఆ అదృష్టం దక్కలేదు. క్యాంపు రాజకీయాలు చేపట్టినా.. యడ్యూరప్ప టీమ్ ఆ పనిలో సక్సెస్ కాలేకపోయింది. ఒక విధంగా కాంగ్రెస్, జేడీఎస్ సభ్యులు మాత్రం ఇప్పుడు ఆనందంలో తేలిపోయారు. తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించిన యడ్యూరప్ప.. గవర్నర్‌కు తన లేఖను అందించేందుకు వెళ్లారు. అయితే బలపరీక్షకు కావాల్సిన సంఖ్య లేకపోవడంతో బీజేపీ మధ్యలోనే చేతులెత్తేసింది. ఇక ఇప్పడు గవర్నర్ మీదే అందరి దృష్టి నిలిచింది. కాంగ్రెస్, జేడీఎస్ కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ వాజూభాయ్ ఆహ్వానించే అవకాశాలున్నాయి.

3333
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles