సుప్రీం కోర్టును ఆశ్రయించిన కర్ణాటక సీఎం కుమారస్వామి

Fri,July 19, 2019 05:40 PM

Karnataka CM HD Kumaraswamy moves SC seeking clarification of July 17 order

బెంగళూరు: కర్ణాటక రాజకీయం సుప్రీంకోర్టు చుట్టూ తిరుగుతోంది. తాజాగా గవర్నర్ వాజూభాయ్ వాలా ఆదేశాలపై కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. బలపరీక్షపై గవర్నర్ పంపిన లేఖలను సవాల్ చేశారు. అలాగే విప్‌పై స్పష్టతనివ్వాలని కోరారు. అసెంబ్లీ ప్రొసీడింగ్స్‌లో గవర్నర్ జోక్యం చేసుకుంటున్నారని కుమారస్వామి పేర్కొన్నారు. సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుండగా గవర్నర్ జోక్యం చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. విప్ అనేది రాజ్యాంగ హక్కు అని కుమారస్వామి పిటిషన్‌లో పేర్కొన్నారు.

తొలుత మధ్యాహ్నం 1.30 గంటల్లోపు బలపరీక్ష పూర్తి చేయాలని కోరిన గవర్నర్.. విశ్వాస పరీక్ష చేపట్టకపోవడంతో శుక్రవారం సాయంత్రం 6 గంటల్లోపు బలం నిరూపించుకోవాలని కుమారస్వామికి మరోసారి లేఖ రాశారు. దీనిపై కుమారస్వామి స్పందిస్తూ.. విశ్వాస తీర్మాన చర్చపై సభకు గవర్నర్ ఎలాంటి ఆదేశాలు జారీ చేయకూడదు. సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్దంగా గవర్నర్ ఆదేశాలు ఉన్నాయని కుమారస్వామి పేర్కొన్నారు.

1105
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles