కర్ణాటక శాసనసభ సోమవారానికి వాయిదా

Fri,July 19, 2019 08:39 PM

Karnataka Assembly Session has been adjourned till July 22. The trust vote will be held on Monday, July 22.

బెంగళూరు: కర్ణాటక శాసనసభ సోమవారానికి వాయిదా పడింది. రెండో రోజూ విశ్వాస పరీక్షపై ఓటింగ్ జరగలేదు. సోమవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రారంభంకానుంది. సభను స్పీకర్ వాయిదా వేయడంతో సభలో నిలబడి బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారమే బలపరీక్ష నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఒకవేళ స్పీకర్ ఓటింగ్ నిర్వహించకుంటే రాష్ట్రపతిని కలవాలని బీజేపీ భావిస్తోంది. విశ్వాస తీర్మానంపై చర్చ ముగిసిన తర్వాతే ఓటింగ్ చేపడుతామని స్పీకర్ రమేష్ కుమార్ స్పష్టం చేశారు.

422
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles