కార్గిల్ విజ‌యం.. మ‌న స‌త్తాకు నిద‌ర్శ‌నం

Wed,July 26, 2017 11:49 AM

Kargil Vijay Diwas reminds us of Indias military prowess says PM Narendra Modi

న్యూఢిల్లీ: కార్గిల్ విజ‌య్ దివ‌స్ సంద‌ర్భంగా అమ‌ర‌వీరుల‌కు ఘ‌నంగా నివాళుల‌ర్పించారు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ. ఆ యుద్ధంలో మ‌నం సాధించిన విజ‌యం.. మ‌న మిలిట‌రీ స‌త్తాకు నిద‌ర్శ‌న‌మ‌ని మోదీ అన్నారు. మ‌న సైనికులు చేసిన త్యాగాల‌ను ఈ సంద‌ర్భంగా ఆయ‌న గుర్తు చేసుకున్నారు. 1999లో జ‌రిగిన కార్గిల్ యుద్ధ విజ‌యానికి గుర్తుగా.. ప్ర‌తి ఏడాది జులై 26న దేశ‌వ్యాప్తంగా కార్గిల్ విజ‌య్ దివ‌స్ జ‌రుపుకుంటున్నారు. పాక్ బ‌ల‌గాలు ల‌డాక్ ప్రాంతంలోని కొండ‌ల్లో ఉన్న భార‌త పోస్ట్‌ల‌ను ఆక్ర‌మించుకోవ‌డంతో ఈ యుద్ధం మొదలైంది. స‌రిగ్గా 18 ఏళ్ల కిందట ఇదే రోజున భార‌త సైన్యం విజ‌య‌వంతంగా మన ప్రాంతాల‌పై తిరిగి ప‌ట్టు సాధించ‌గ‌లిగింది. ఈ సంద‌ర్భంగానే ట్విట్ట‌ర్‌లో ప్ర‌ధాని మోదీ కార్గిల్ విజ‌యాన్ని స‌ర్మించుకున్నారు.
1717
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles