బెగుసరాయ్‌ నుంచి కన్హయ్య కుమార్‌ పోటీ

Tue,March 12, 2019 10:16 AM

Kanhaiya Kumar will contest from begusarai

పాట్నా : జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ మాజీ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్‌ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యాడు. బీహార్‌లోని బెగుసరాయ్‌ నియోజకవర్గం నుంచి కన్హయ్య కుమార్‌ పోటీ చేస్తున్నట్లు మహా కూటమి ప్రకటించింది. కాంగ్రెస్‌, ఆర్జేడీ, రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీ, హిందూస్థానీ ఆవామ్‌ మోర్చా(సెక్యూలర్‌), వికాస్‌షీల్‌ ఇసాన్‌ పార్టీ, వామపక్షాలు కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయి. కన్హయ్య కుమార్‌.. సీపీఐ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో బరిలో దిగనున్నారు. సీపీఐ పార్టీ సీనియర్‌ నాయకుడు నరేష్‌ పాండే కూడా కన్హయ్య పోటీని ధృవీకరించారు.

2016లో కన్హయ్య కుమార్‌పై నమోదైన దేశద్రోహం కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు వివిధ సెక్షన్ల కింద ఛార్జీషీట్‌ రూపొందించి ఇటీవలే పాటియాలా హౌజ్‌ కోర్టులో సమర్పించారు. 2016లో జేఎన్‌యూలో జరిగిన ఓ కార్యక్రమంలో అతడు ఇండియా వ్యతిరేక నినాదాలు చేయడంతోపాటు పార్లమెంట్‌పై దాడి చేసిన ఉగ్రవాది అఫ్జల్ గురును కూడా పొగిడాడన్న ఆరోపణలపై దేశ ద్రోహం కేసు పెట్టారు.

1056
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles