బెగూసరాయ్ లోక్‌సభ స్థానం నుంచి క‌న్న‌య్య పోటీ

Sun,March 24, 2019 12:13 PM

Kanhaiya Kumar Is Left Candidate From Begusarai After Coalition Snub

ప‌ట్నా: ఢిల్లీలోని జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) స్టూడెంట్స్ యూనియ‌న్ మాజీ అధ్య‌క్షుడు కన్నయ్య కుమార్ వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బిహార్ నుంచి ఎంపీగా పోటీ చేయనున్నారు. బెగూసరాయ్ లోక్‌సభ స్థానం నుంచి సీపీఐ అభ్య‌ర్థిగా క‌న్న‌య్య‌ బ‌రిలో దిగుతున్నారు. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన మిత్రపక్ష పార్టీలైన కాంగ్రెస్‌, ఆర్జేడీ పార్టీలు ప్ర‌తిప‌క్షాల ఉమ్మ‌డి అభ్య‌ర్తిగా కన్నయ్య కుమార్‌కు మద్దతు తెలిపాయి. అయితే పొత్తులో భాగంగా ఆ సీటును ఆర్జేడీ నేత తేజ‌స్వీ యాద‌వ్‌కు కేటాయించారు. దీంతో సీపీఐ త‌ర‌ఫున క‌న్న‌య్య పోటీకి దిగుతున్నారు.

బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా కొన్ని సీట్లలో మాత్రమే పోటీచేయాలని నిర్ణయించుకున్నట్లు వామపక్ష పార్టీలు తెలిపాయి. బిహార్‌లో ప్రధాన వామపక్ష పార్టీ సీపీఐ(ఎం-ఎల్‌) మహాకూటమిపై మండిపడింది. ఆర్జేడీ, కాంగ్రెస్‌ ప్రధాన పార్టీలుగా ఉన్న మహాకూటమిలో తమకు సీట్లను కేటాయించకుండా కొన్ని పార్టీలతో మాత్రమే పొత్తుపెట్టుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. వామపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా కన్నయ్య రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.

బిహార్‌లో మహాకూటమిలోని పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. రాష్ట్రీయ జనతా దళ్‌(ఆర్జేడీ)-20, కాంగ్రెస్‌ పార్టీ-9, రాష్ట్రీయ లోక్‌ సమతా పార్టీ(ఆర్‌ఎల్‌ఎస్‌పీ)-5, హిందుస్థానీ అవామ్‌ మోర్చ(హెచ్‌ఏఎం)-3, వికాసశీల్‌ ఇన్సాన్‌ పార్టీ-3 స్థానాల్లో పోటీ చేయనున్న విష‌యం తెలిసిందే. 2014 ఎన్నికల్లో బెగూసరాయ్ నియోజవర్గంలో ఆర్జేడీ అభ్యర్థి తన్వీర్‌ సింగ్‌పై బీజేపీ అభ్యర్థి భోలా సింగ్‌ 58 ఓట్లు మెజార్టీతో విజయం సాధించారు.

1688
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles