కేంద్రమంత్రి వెంకయ్యకు కడియం కృతజ్ఞతలు

Tue,June 27, 2017 01:22 PM

Kadiyam Srihari meets with Venkaiah Naidu

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడును డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఢిల్లీలో కలిశారు. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసులను ఆమోదించినందుకు వెంకయ్యకు కడియం కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ర్టానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్రమంత్రితో డిప్యూటీ సీఎం చర్చించారు. కడియంతో పాటు వెంకయ్యను కలిసిన వారిలో ఎంపీ వినోద్, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఢిల్లీలోని ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి ఉన్నారు.

వెంకయ్యనాయుడితో భేటీ ముగిసిన అనంతరం కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడారు. ఏకీకృత సర్వీస్ రూల్స్ ఆమోదంపై కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపామని కడియం శ్రీహరి తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏకీకృత సర్వీస్ రూల్స్‌పై చొరవ తీసుకుని సీఎం కేసీఆర్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లారని గుర్తు చేశారు. 1998 నుంచి ఈ సమస్య నలుగుతూనే ఉందన్నారు. విద్యాప్రమాణాలు పెంపు, ఉపాధ్యాయుల పదోన్నతులు అనేక సమస్యలు ఈ సర్వీస్ రూల్స్‌పై ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నారు. ఉపాధ్యాయ పదోన్నతులకు సంబంధించి కమిటీని ఏర్పాటు చేసి న్యాయపరమైన సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ తమకు సూచించారని తెలిపారు.

ఎస్సీ వర్గీకరణ అంశాన్ని వెంకయ్యనాయుడు దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానం చేసిన ప్రతులను ప్రధాని మోదీకి సీఎం నేరుగా అందించిన విషయాన్ని గుర్తు చేశామన్నారు. రాష్ర్టానికి మాత్రమే పరిమితమయ్యేలా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని కోరామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతిస్తున్న విషయాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.

1230
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles