బాలికా విద్యను ఎలా ప్రోత్సహించాలనేది పరిశీలించాం: కడియం

Tue,June 5, 2018 06:28 PM

Kadiyam Srihari meets Prakash javadekar today

న్యూఢిల్లీ: భారతదేశంలో బాలికా విద్యను ఎలా ప్రోత్సహించాలనేది పరిశీలించామని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం వెల్లడించారు. బాల్య వివాహాలను అరికట్టడానికి విద్యావకాశాలు ఎలా తోడ్పడుతాయనే అంశాలు కేంద్రమంత్రి జవదేకర్‌కు వివరించినట్లు తెలిపారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను ఇవాళ సాయంత్రం సీఏబీఈ(సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్) కమిటీ కలిసింది. బాలికల విద్య ప్రోత్సాహానికి అనుసరించాల్సిన వ్యూహంపై కమిటీ చైర్మన్ కడియం శ్రీహరి నివేదిక ఇచ్చారు.

ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ.. కేబ్‌నెట్ సబ్ కమిటీ ఆధారంగా కేజీబీవీలను పన్నెండో తరగతి వరకు అప్‌గ్రేడ్ చేయడంపై సంతోషించామన్నారు. అప్‌గ్రేడ్ చేసే క్రమంగా 15 మంది ఉపాధ్యాయులను ఇస్తే బాగుంటుందని మేం సూచించాం. ప్రతీ సెక్షన్‌లో 20 మంది విద్యార్థులకే తీసుకునే అవకాశం ఇచ్చారు. పన్నెండో తరగతిలో సెక్షన్‌కు 40 మంది విద్యార్థులను తీసుకునే అవకాశం కల్పించాలని కోరామన్నారు. ఉపాధ్యాయులకు మంచి వేతనాలు చెల్లించాలని కోరామన్నారు.

1682
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles