ప్రధాని ప్రసంగం.. కుప్పకూలిన కెమెరామెన్‌.. వీడియో

Wed,January 30, 2019 05:07 PM

K Ramoliya Cameraman who fainted during PM Modi speech in Surat

సూరత్‌ : గుజరాత్‌లోని సూరత్‌లో న్యూ టర్మినల్‌ బిల్డింగ్‌ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తున్నారు. ఈ సమయంలో అక్కడున్న ఓ కెమెరామెన్‌ కుప్పకూలిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన మోదీ తక్షణమే తన ప్రసంగాన్ని ఆపేసి.. అధికారులను, పోలీసులను అప్రమత్తం చేశారు. అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించాలని మోదీ సూచించారు. దీంతో కెమెరామెన్‌ కిషన్‌ రామోలియాను 108లో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

స్పృహ వచ్చిన తర్వాత రామోలియా మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళ ఉదయం నుంచి తాను నీళ్లు తాగలేదు. వాటర్‌ బాటిళ్లను సభలోకి అనుమతించలేదు. దీంతో స్పృహ కోల్పోవాల్సి వచ్చింది. ఆ సమయంలో ప్రధాని మోదీ తనను గమనించి అధికారులను అప్రమత్తం చేసి ఆస్పత్రికి తరలించేలా సహాయం చేశారని రామోలియా పేర్కొన్నారు.2261
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles