సుప్రీం జడ్జీలుగా జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ ఖన్నాల ప్రమాణం

Fri,January 18, 2019 12:40 PM

Justices Dinesh Maheshwari and Sanjiv Khanna take oath as Supreme Court judges

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు జడ్జీలుగా జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ సంజీవ్ ఖన్నా ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ ఖన్నా చేత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రమాణస్వీకారం చేయించారు. జస్టిస్ దినేశ్ మహేశ్వరి కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, జస్టిస్ ఖన్నా ఢిల్లీ హైకోర్టు న్యాయమమూర్తిగా పని చేశారు. వీరిద్దరి ప్రమాణంతో సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య 28కి చేరింది. మొత్తం సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య 31. సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, జస్టిస్‌ ఏకే సిక్రి, జస్టిస్‌ ఎస్‌ఏ బాంబ్డే, జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ అరుణ్‌ మిశ్రాలతో కూడిన కొలీజియం ఈ నెల 10వ తేదీన ఈ ఇద్దరు న్యాయమూర్తులకు పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వానికి సిఫారసు చేసిన సంగతి తెలిసిందే.

621
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles