ధ‌ర్మాస‌నం నుంచి వైదొలిగిన‌ జ‌డ్జి.. అయోధ్య కేసు వాయిదా

Thu,January 10, 2019 11:12 AM

Justice UU Lalit opts out of Ayodhya case bench, hearing adjourned for January 29

న్యూఢిల్లీ: అయోధ్య భూవివాద కేసును ఈనెల 29కి వాయిదా వేశారు. సుప్రీంకోర్టులో అయిదుగురు స‌భ్యుల ధ‌ర్మాస‌నం ఇవాళ ఈ అంశంపై విచార‌ణ ప్రారంభించేందుకు నిరాక‌రించింది. ఇవాళ విచార‌ణ ఉండ‌దు అని, కేవ‌లం త‌దుప‌రి విచార‌ణ తేదీని వెల్ల‌డించ‌నున్న‌ట్లు కోర్టు పేర్కొన్న‌ది. అయోధ్య భూవివాద కేసు నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు జ‌స్టిస్ యూయూ ల‌ల‌త్‌.. కోర్టు తీర్పుకు ముందు తెలిపారు. జ‌స్టిస్ యూయూ ల‌లిత్‌.. ఇదే కేసులో క‌ల్యాన్ సింగ్ త‌ర‌పున వాదించిన‌ట్లు అడ్వ‌కేట్ రాజీవ్ ధావ‌న్ త‌న పిటీష‌న్‌లో కోరారు. దీంతో ఈ బెంచ్ నుంచి వైదొలుగుతున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. జ‌స్టిస్ ల‌లిత్ త‌ప్పుకోవ‌డంతో.. మ‌ళ్లీ అయోధ్య అంశాన్ని విచారించేందుకు కొత్త బెంచ్‌ను ప్ర‌క‌టించ‌నున్నారు. అయిదుగురు స‌భ్యుల ధ‌ర్మాసనంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్‌తో పాటు జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ చంద్రచూడ్ సభ్యులుగా ఉన్నారు. అయితే ల‌లిత్ వైదొల‌గ‌డంతో ఆయ‌న స్థానంలో కొత్త జ‌స్టిస్‌ను ఎంపిక చేయ‌నున్నారు.

1486
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles