సుప్రీంకోర్టు సీజేగా జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రమాణస్వీకారం

Wed,October 3, 2018 11:19 AM

Justice Ranjan Gogoi sworn in as Chief Justice of India

న్యూఢిల్లీ: దేశ సర్వోన్నత న్యాయస్థానం 46వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగోయ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు సీజేగా జస్టిస్ రంజన్ గొగోయ్ చేత భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ దీపక్ మిశ్రా నుంచి గొగోయ్ బాధ్యతలు స్వీకరించారు. సీనియర్ న్యాయవాది అయిన గొగోయ్ 13నెలల పాటు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించనున్నారు. ఈశాన్యం నుంచి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన తొలి సీజేఐగా గగోయ్ చరిత్ర సృష్టించారు. రాష్ట్ర‌ప‌తిభ‌వ‌న్‌లో నిర్వ‌హించిన‌ కార్య‌క్ర‌మంలో భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ, లోక్‌స‌భ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.


అస్సాం మాజీ ముఖ్యమంత్రి కేశవ్ చంద్ర గొగోయ్ కుమారుడైన రంజన్ గొగోయ్ దిబ్రూగ‌ఢ్‌లో 1954 నవంబర్ 18వ తేదీన జన్మించారు. ఢిల్లీ వ‌ర్సిటీలో న్యాయ‌విద్య‌ను అభ్య‌సించారు. 1978లో బార్ అసోసియేష‌న్‌ల్ చేరారు. 1978లో న్యాయవాదిగా చేరి గువాహటి హైకోర్టులో ఎక్కువ కాలం పనిచేశారు. 2001 ఫిబ్రవరి 28న గువాహటి హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2010 సెప్టెంబర్ 9న పంజాబ్ - హరియాణా హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2011 ఫిబ్రవరి 12న ఆ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. 2012 ఏప్రిల్ 23న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.

1772
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles