లోక్‌పాల్‌గా జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ ప్రమాణ స్వీకారం

Sat,March 23, 2019 11:45 AM

Justice PC Ghose Takes Oath As India's First Lokpal

ఢిల్లీ: దేశ తొలి లోక్‌పాల్‌గా జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌తో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణ స్వీకారం చేయింయించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ పాల్గొన్నారు. లోక్‌పాల్‌ జ్యూడీషియల్ సభ్యులుగా జస్టిస్ దిలీప్ బి భోసలే, జస్టిస్ ప్రదీప్ కుమార్, జస్టిస్ అభిలాష కుమారి, జస్టిస్ అజయ్ కుమార్. నాన్ జ్యూడీషియల్ సభ్యులుగా దినేష్ కుమార్ జైన్, అర్చనా రామసుందరం, మహేందర్ సింగ్, ఇందరజిత్ ప్రసాద్ గౌతమ్ నియమితులైన విషయం తెలిసిందే

748
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles