తీర్పు ఇరువర్గాల ప్రజలకు ఉపశమనం: శ్రీ శ్రీ రవిశంకర్‌

Sat,November 9, 2019 12:47 PM

హైదరాబాద్‌: వివాదాస్పద అయోధ్య స్థలంపై సుప్రీంకోర్టు నేడు వెలువరించిన తీర్పును హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు పండిట్‌ శ్రీ శ్రీ రవిశంకర్‌ తెలిపారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఆయన ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పు ఇరు వర్గాల ప్రజలకు సంతోషం కలుగజేయడంతో పాటు గొప్ప ఉపశమనాన్ని ఇస్తుందన్నారు. అయోధ్య భూవివాదంపై కోర్టు వెలుపల రాజీ కుదుర్చుకోవాలన్న సూచనల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కమిటీలో శ్రీ శ్రీ రవిశంకర్‌ సభ్యుడిగా ఉన్న విషయం తెలిసిందే.

585
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles