పాక్ ఎఫ్ -16 విమానాన్ని కూల్చేశాం: త్రివిధ దళాలు

Thu,February 28, 2019 07:55 PM

న్యూఢిల్లీ: త్రివిధ దళాలు ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్ ఢిల్లీలో సంయుక్త మీడియా సమావేశం నిర్వహించాయి. ఈసందర్భంగా పాక్ ఎఫ్-16 విమానం కూల్చివేతపై సైన్యం ఆధారాలు బయటపెట్టింది. పాక్‌కు చెందిన ఎఫ్-16 శకలాలను త్రివిధ దళాల ఉన్నతాధికారులు మీడియాకు చూపించారు. పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-16 విమానం నుంచి పేల్చిన అమ్రామ్ మిస్సైల్ శకలాలను వాళ్లు మీడియాకు చూపించారు.అమ్రామ్ పరికరం ఒకటి రాజౌరి సెక్టార్‌లో దొరికింది. ఎఫ్-16లు మాత్రమే అమ్రామ్ పరికరాలను ప్రయోగించగలవు. ఎఫ్-16 శకలాలు కూడా రాజౌరి సెక్టార్‌లో దొరికాయి. ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమైనట్లు మా వద్ద ఆధారాలు ఉన్నాయి. మన సైనిక స్థావరాలనే పాక్ లక్ష్యంగా చేసుకుందనడంలో సందేహం లేదు. పాక్ కవ్వింపు చర్యలను దిగితే తిప్పికొడతాం. భారత గగనతలంలోకి పాక్ విమానాలు ప్రవేశించినట్లు ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ గుర్తించింది. భారత వాయుసేనకు చెందిన మిగ్-21 ఆచూకీ లభించలేదు. తొలుత 2 యుద్ధ విమానాలను కూల్చివేశామని పాక్ చెప్పింది. ఇద్దరు పైలట్లు తమ అదుపులో ఉన్నారని మొదట పాక్ ప్రకటించింది. నిన్న సాయంత్రానికి ఒక్క పైలటే తమ అదుపులో ఉన్నారని వాస్తవం ఒప్పుకుంది. జనజీవనం లేని ప్రాంతాల్లోనే బాంబులు వేశామని పాక్ అబద్ధం చెప్పింది. అభినందన్‌ను అప్పగించడం జెనీవా ఒప్పందంలో భాగమే. వైమానిక దాడులపై పాకిస్థాన్ పలుమార్లు మాట మార్చిందని త్రివిధ దళాల ఉన్నతాధికారులు మీడియాకు వెల్లడించారు.

3130
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles