ఇలాగేనా నిరసన తెలిపే విధానం: జేఎన్‌యూ వీసీ

Tue,March 26, 2019 09:35 AM

JNU Vice Chancellor Says Students Forcibly Entered Home

ఢిల్లీ: తమ విద్యార్థుల చర్యను జవహార్‌లాల్‌ నెహ్రు యూనివర్సిటీ(జేఎన్‌యూ) వైస్‌ ఛాన్సలర్‌ ఎం జగదీష్‌ కుమార్‌ తీవ్రంగా నిరసించారు. సోమవారం సాయంత్రం వర్సిటీ విద్యార్థులు బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి వీసీ భార్యను గంటల తరపడి నిర్భందం చేసినట్లుగా ఆరోపణ. ఈ విద్యా సంవత్సరం నుంచి వర్సిటీ ప్రవేశ పరీక్షను ఆన్‌లైన్‌ చేయడాన్ని నిరసిస్తూ ఏడుగురు విద్యార్థులు గత వారంరోజులుగా నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్నారు. ఈ అంశంపై మాట్లాడేందుకు విద్యార్థుల్లోని లెఫ్ట్‌ వింగ్‌కు చెందిన పలువురు వీసీని కలిసేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేరు. బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించినట్లు ఆరోపణ. సమస్య గురించి చర్చించేందుకు గత వారం వెళ్లగా సమస్య గురించి మాట్లాడకుండా వీసీ తమకు స్వీట్లు ఇచ్చి సాగనంపారన్నారని విద్యార్థులు పేర్కొంటున్నారు. పలుమార్లు కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ వీసీ సమయం ఇవ్వలేదన్నారు. దీంతో వీసీని కలిసి మాట్లాడేందుకు ఆయన ఇంటికి వెళ్లినట్లుగా చెబుతున్నారు.

విద్యార్థుల చర్యపై వీసీ స్పందిస్తూ.. నిరసన తెలిపేందుకు ఇదా మార్గమని ప్రశ్నించారు. ఇంట్లో లేని సమయం చూసి దౌర్జన్యానికి దిగారన్నారు. ఒంటరి మహిళను గంటలపాటు నిర్భందించారన్నారు. దీనిపై తాము పోలీసు ఫిర్యాదు చేయబోతున్నట్లు తెలిపారు. ఇటువంటి చర్యలకు విద్యార్థులు భవిష్యత్తులో పాల్పడకుండా వారిలో మార్పు వస్తుందని ఆశిస్తున్నామన్నారు. కాగా వీసీ వ్యాఖ్యలను విద్యార్థులు తోసిపుచ్చారు. వైస్‌ ఛాన్సలర్‌ను కలిసేందుకు కొందమంది విద్యార్థులు ఆయన ఇంటికి వెళ్లారు. అక్కడ ఉన్న సెక్కూరిటీ సిబ్బంది తమపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారన్నారు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయన్నారు. గాయపడ్డవారిలో జేఎన్‌యూఎస్‌యూ ప్రెసిడెంట్‌ ఎన్‌. సాయి బాలాజీ సైతం ఉన్నట్లు తెలిపారు.

839
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles